Breaking News

కేథ‌రిన్ థ్రెసాతో స్టార్‌ హీరో వారసుడు స్టెప్పులు

Published on Sat, 12/06/2025 - 06:47

నటుడు విజయ్‌ వారసుడు జేసన్‌ సంజయ్‌ తండ్రి బాటలోనే పయనిస్తారని అందరూ భావించారు. జేసన్‌ సంజయ్‌ సౌత్‌ కాలిఫోర్నియాలో నటన, దర్శకత్వం శాఖల్లో శిక్షణ పొందారు. దీంతో ఈయన నటనపై కాకుండా దర్శకత్వంపై మొగ్గు చూపారు. అలా జేసన్‌ సంజయ్‌ మెగాఫోన్‌ పట్టి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఇందులో నటుడు సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ప్రియా అబ్దుల్లా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. 

దీంతో సిగ్మా చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకుంటుందని, దీన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటలో మెడ్రాస్‌ చిత్రం ఫేమ్‌ కేథ‌రిన్ థ్రెసా(Catherine Tresa ) నటించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెతోపాటు దర్శకుడు జేసన్‌ సంజయ్‌ కూడా స్టెప్స్‌ వేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

అయితే ఆ పాటలో ఈ వర్ధమాన దర్శకుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారా లేక పూర్తిగా ఆ పాటలో కేథ‌రిన్ థ్రెసాతో కలిసి నటించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై చిత్ర వర్గాల నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఈ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో ఒక్క పాటలో మెరిసే జేసన్‌ సంజయ్‌ ఆ తరువాత హీరోగా నటించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)