Breaking News

చిక్కుల్లో 'థ్యాంక్ గాడ్'.. కేసు నమోదు.. ట్రైలర్‌లో ఏముంది?

Published on Wed, 09/14/2022 - 16:53

బాలీవుడ్​ నటులు అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ మల్హోత్రా నటించిన చిత్రం 'థ్యాంగ్ గాడ్' చిక్కుల్లో పడింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా.. అదే ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టింది. దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ‘థ్యాంక్ గాడ్’ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు నమోదైంది. నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
(చదవండి: అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు)

ఇటీవల విడుదలైన 'థ్యాంక్ గాడ్' ట్రైలర్‌ ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ హిమాన్షు శ్రీవాస్తవ కోర్టుకు వివరించారు. ఓ సన్నివేశంలో అజయ్ దేవగణ్ సూటు ధరించి చిత్రగుప్తుని పాత్రలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చిత్రగుప్తుడు మంచి, చెడులను లెక్కిస్తాడు. దేవుళ్లను ఇలా వర్ణించడం వల్ల ఓ మతం మనోభావాలను దెబ్బతీస్తుందని న్యాయవాది పిటిషన్‌లో వివరించారు. దీంతో అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ్‌ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)