Breaking News

సంగీత ప్రపంచంలోకి కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ వారసుడు!

Published on Fri, 07/14/2023 - 14:24

తమిళ సినీ రంగంలో ప్రముఖ నటుడిగా, రాజకీయ నేతగా రాణించిన డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్‌. ఈయన్ని సినీ పరిశ్రమకు చెందినవారు కెప్టెన్‌ అని పిలుస్తుంటారు. విజయకాంత్‌ పెద్ద కొడుకు విజయ ప్రభాకరన్‌ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాంటిది తాజాగా ఆయన సంగీత రంగంలో హద్దులను మార్చడానికి వీజేపీ, ప్రాక్టికల్‌ కాన్సర్ట్స్‌ సంస్థలతో భాగస్వామి అయ్యారు. వీరంతా నవంబర్‌ 25వ తేదీన ముంబైలో భారీ సంగీత విభావరిని నిర్వహించనున్నారు.

ఇందులో ప్రఖ్యాత సంగీత కళాకారుడు 50 సెంట్‌ (కర్టిస్‌ జేమ్స్‌ జాక్సన్‌) పాల్గొననున్నారు. అంతర్జాతీయ అవార్డులు అయిన గ్రామీ, ఎమ్మీ అవార్డులను గెలుచుకున్న ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అనేక సంగీత కచేరీలను నిర్వహించి ప్రాచుర్యం పొందిన 50 సెంట్‌ ఇండియా, ముంబైలో నవంబర్‌ 25వ తేదీన ది ఫైనల్‌ ల్యాప్‌ టూర్‌ –2023 పేరుతో జరగనున్న ర్యాప్‌ సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు.

ఈమేరకు విజయ ప్రభాకరన్‌ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ ఇతర కళారంగాల్లో కెప్టెన్‌గా పిలవబడే తన తండ్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ సంగీత కచేరి నిర్వహణ అని చెప్పారు. ఈ ప్రయత్నం కొత్తగానూ, కళారంగంలో సరికొత్త ఆరంభానికి నాందిగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చదవండి: ప్చ్‌.. పిలవగానే వెళ్లాల్సింది.. సల్మాన్‌ పక్కన హీరోయిన్‌ అయ్యేదాన్ని

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)