Breaking News

Captain Miller: 'కెప్టెన్ మిల్లర్' చిత్రానికి అంతర్జాతీయ అవార్డ్‌

Published on Thu, 07/04/2024 - 10:58

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌- అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈ ఏడాదిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిడమే కాకుండా తాజాగా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. లండన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ' కెప్టెన్ మిల్లర్' సత్తా చాటింది.

యుకె నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. గ్రే మ్యాన్‌ సినిమా ద్వారా ధనుష్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో ఆయన పేరు ఇప్పుడు హాలీవుడ్‌లో ట్రెండ్‌ అవుతుంది. పలు హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడినప్పటికీ విజేత కెప్టెన్ మిల్లర్ కావడంతో ధనుష్‌ అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్‌’ కూడా నామినేషన్‌లో చోటు దక్కించుకుంది. కానీ, అవార్డ్‌ అందుకోలేపోయింది.

ఈ చిత్రంలో ధనుష్‌ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ధనుష్‌తో పాటు, ఈ చిత్రంలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసి ధనుష్‌ బెస్ట్‌ సినిమాల జాబితాలో చేరిపోయింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రస్తుతం ధనుష్‌ 'రాయన్‌'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం విశేషం. జులై 26న ఈ చిత్రం విడుదల కానుంది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జె.సూర్య, కాళిదాస్‌ జయరామ్‌ వంటి స్టార్స్‌ ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)