Breaking News

ప్రముఖ సింగర్‌కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు!

Published on Mon, 06/23/2025 - 20:08

ప్రముఖ సింగర్‌ దిల్జీత్‌ దోసాంజ్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్‌ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన  ది క్రియేటివ్ స్కూల్‌లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్‌లో ఈ విషయాన్ని ‍ప్రకటించారు.

కాగా.. పంజాబ్‌కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్‌చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్‌చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్‌ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్‌రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది  'చమ్‌కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)