Breaking News

12 రకాల సర్జరీలు.. లక్షల డాలర్లు ఖర్చు..తీరా చూస్తే ప్రాణం పోయింది!

Published on Tue, 04/25/2023 - 17:01

హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కెనడాకు చెందిన నటుడు సెయింట్ వాన్ కోలుచి(22) కన్నుమూశారు. అయితే ముఖానికి సర్జరీ చేయించుకోవడం వల్లే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఉదయం దక్షిణ కొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సెయింట్ వాన్ కొలూచి 12 ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

గతేడాది నవంబర్‌లో  దవడకు అమర్చిన ఇంప్లాంట్‌లను తొలగించుకోవడానికి ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అది ఇన్‌ఫెక్షన్‌కు దారి తీయడంతో కొద్ది గంటలకే మృతి చెందాడు. వాన్ కొలూచి సినీ ఇండస్ట్రీలో రావడానికి 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు అతని సన్నిహితులు తెలిపారు. అతను  దక్షిణ కొరియా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)