Breaking News

ఆ నటుడితో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన హీరోయిన్‌!

Published on Sat, 09/17/2022 - 09:24

తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్‌. యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్‌గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్‌ రాకర్స్‌ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్‌గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది.

నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్‌ శివన్‌ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్‌ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్‌ పరిస్థితి ఇదేననే టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది.

ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది.

దీంతో వాణిభోజన్‌ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్‌నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం.

Videos

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)