Breaking News

హీరోయిన్‌తో ప్రేమలో కాలభైరవ! హింట్‌ ఇచ్చారా?

Published on Tue, 03/24/2026 - 14:23

టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రొఫెషనల్‌ పనులతోనే బిజీగా ఉండకుండా కాస్త పర్సనల్‌ లైఫ్‌పైనా ఓ కన్నేశారు. జీవితంలో ఓ అడుగు, కాదు కాదు.. ఏడడుగుల బంధంలోకి వెళ్లే ప్లాన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, అల్లు శిరీష్‌ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్‌ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. 

ఆ సినిమా నుంచే లవ్‌
ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సింగర్‌ కాలభైరవ చేరనున్నట్లు తెలుస్తోంది. బలగం హీరోయిన్‌ కావ్య కల్యాణ్‌రామ్‌తో అతడు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట రూమర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఉస్తాద్‌ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట! కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కథానాయికగా నటించింది. 

హింట్‌ ఇచ్చారా?
అలా ఈ మూవీ సెట్‌లో వీరికి ఏర్పడిన పరిచయం రానురానూ ప్రేమబంధంగా మారిందట! వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చజెండా ఊపారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కావ్య, కాల భైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అంటే తాము ప్రేమలో ఉన్నమాని సిగ్నల్స్‌ ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సినిమా
కావ్య కల్యాణ్‌ రామ్‌ విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె గంగోత్రి మూవీలో బాలనటిగా యాక్ట్‌ చేసింది. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్‌, బాలు, బన్నీ, పాండురంగడు.. ఇలా అనేక సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్‌గా మారింది. బలగం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. కాలభైరవ విషయానికి వస్తే.. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. 

కెరీర్‌
కలర్‌ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా.. వంటి పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్యా.. పాట సింగర్‌గా అతడికి మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ గెల్చుకుంది. అదే చిత్రంలోని కొమురం భీముడో పాటకుగానూ కాలభైరవకు జాతీయ అవార్డు వచ్చింది.

 

 

చదవండి: బ్యాండ్‌మేళం కోసం చిరంజీవినే రిస్క్‌లో పడేసిన కోన వెంకట్‌

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)