Breaking News

మెగా హిట్‌ ‘గాడ్‌ ఫాదర్‌’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ అందులోనేనా?

Published on Fri, 10/07/2022 - 18:12

టాలీవుడ్‌లో  ఇప్పుడు ఎక్కడ చూసినా ‘గాడ్‌ ఫాదర్‌’ గురించే చర్చ జరుగుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ  చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరిచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు మోహన్‌ రాజా.
(చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్‌ ఫాదర్‌’దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్‌)

దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం..ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించి మెగాస్టార్‌ సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించింది.  ఈ వారాంతంలో ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు ‘గాడ్‌ ఫాదర్‌’ డిజిటల్‌ రైట్స్‌ని దక్కించుకుందట. రూ. 57 కోట్లకు తెలుగు, హిందీ భాషల హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఈ చిత్రం రానుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)