Breaking News

BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 07/28/2023 - 06:43

మెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ కీలక హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘బ్రో’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్‌ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్‌ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ  కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్‌గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్‌ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్‌ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

‘బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్‌ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్‌ బాగా వర్కౌట్‌ అయింది. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

పవన్‌ కల్యాణ్‌ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్‌ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)