Breaking News

ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట

Published on Wed, 04/06/2022 - 16:38

Brazilian Model Arthur O Urso Wants To Marry Two More: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా ఉంది అతగాడి తీరు. ఒకరికి డబ్బు పిచ్చి ఉంటుంది. మరొకొందరికి సినిమాల పిచ్చి.. ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఇతగాడికి మాత్రం భార్యల పిచ్చి ఉంది. ఒక భార్యతోనే వేగలేకపోతున్నామని గగ్గోలు పెడుతుంటారు ఫ్యామిలీ మ్యాన్‌లు. ఇతగాడు మాత్రం 'నాకు ఒక్కరు సరిపోరు పది మంది కావాలంటూ' కోరుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా మహానుభావుడు అంటే.. బ్రెజిల్‌కు చెందిన యంగ్‌ మోడల్‌ ఆర్థర్‌ ఓ ఉర్సో. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ మారుమోగిపోతోంది. ఎందుకంటే ఆర్థర్‌ ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా వారి అంగీకారంతోనే. 

9 మంది భార్యలతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఆర్థర్‌. ఆ ఫొటో కాస్తా వైరల్‌ కావడంతో ఫేమస్ అయ్యాడు మనోడు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఆర్థర్‌. ఇప్పటివరకు అతడితో అన్యోన్యంగా ఉన్న 9 మంది భార్యల్లో ఒకరు ఆర్థర్‌కు షాక్‌ ఇచ్చింది. ఆర్థర్‌ 9 మంది భార్యల్లో ఒకరైన అగాథ.. ఉర్సో నుంచి విడాకులు కోరిందట. ఆమె ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటుందని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేకపోవడంతో విడాకులకు అంగీకరించానని ఉర్సో చెప్పుకొచ్చాడు. 'నేను ఆమెకు మాత్రమే సొంతమట. ఇంకేవరితో నేను ఉండకూడదట. ఇదేమన్నా బాగుందా. మనం పంచుకోవాలి. మేము విడిపోతున్నందుకు బాధగానే ఉంది. కానీ ఆమె చెప్పిన కారణం నాకు షాకింగ్‌గా ఉంది.' అని తెలిపాడు బ్రెజిల్‌ యంగ్‌ మోడల్‌ ఆర్థర్‌ ఓ ఉర్సో. 

అంతేకాకుండా తన జీవితంలో 10 మంది భార్యలు ఉండాలని కోరుకుంటున్నాని తెలిపాడు ఆర్థర్. అయితే ఇప్పుడే తన భార్య స్థానాన్ని భర్తీ చేయనని.. కానీ త్వరలోనే ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. అలాగే అతడికి తన ప్రతీ భార్య పట్ల సమానమైన ప్రేమ ఉంటుదన్నాడు. ఈ యంగ్ మోడల్‌కు ఇన్‌స్టా గ్రామ్‌లో 50 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే ఇదివరకు ఈ 9 మందితో జరిగిన తన వివాహానికి బ్రెజిల్‌లోని సోవో పావోలో చట్టబద్దత లేదు. ఆ దేశంలో బహుభార్యత్వం చట్ట విరుద్ధం.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)