Breaking News

బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు.. సీఎం కేసీఆర్‌ను కలిసిన హాస్యబ్రహ్మ

Published on Sat, 07/29/2023 - 18:56

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో తనయుడు సిద్దార్థ్‌.. డాక్టర్‌ ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న పెళ్లి కోసం అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గారిని బ్రహ్మానందం కుటుంబ సమేతంగా కలిసి పెళ్లి పత్రిక అందజేశారు.

తన కుమారుడి పెళ్లికి తప్పకుండా రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్‌ 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. గౌతమ్‌కు ఇదివరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.

బ్రహ్మానందం తన మనవళ్లతో కలిసి ఆడుకున్న ఫోటోలను అప్పుడప్పుడూ షేర్‌ చేస్తుంటారు గౌతమ్‌. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్‌ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడికి సినిమాల మీద ఆసక్తి లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు సమాచారం.

చదవండి: ఆ సినిమాకు రూ.250 కోట్లా?: కంగనా ఫైర్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)