'కన్నప్ప సినిమా ఆయన ఆలోచన కాదు'.. బ్రహ్మనందం ఆసక్తికర కామెంట్స్‌!

Published on Sat, 06/21/2025 - 21:17

మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్‌తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోహన్‌ బాబును ఉద్దేశించిన ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అసలు ఈ సినిమా ఆయన ఎందుకు తీశారా?అని ఒకసారి అనుకున్నానని తెలిపారు. డబ్బుల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఆయన ఇంత భారీ బడ్జెట్‌తో ఎలా ప్లాన్ చేశారా? అనిపించిందని అన్నారు.

బ్రహ్మనందం మాట్లాడుతూ..' కన్నప్ప సినిమా మోహన్‌ బాబు ఎందుకు తీశారా అని ఒకసారి అనుకున్నా. ఎందుకంటే మోహన్ బాబు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఐదు కోట్లో, పది కోట్లతోనూ సినిమా తీసి దాంతో ఓ పది, పదిహేను కోట్లు సంపాదించుకుని.. వాటితో మళ్లీ ఇంకో సినిమా తీసే వ్యక్తి. అలాంటి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవించే వ్యక్తిగా నాకు తెలుసు. 200 కోట్ల రూపాయలు పెట్టి కన్నప్ప సినిమా ఎందుకు ప్లాన్ చేశాడని ఆలోచిస్తే.. ఈ ఆలోచన ఆయనది కాదు.. సకల సృష్టి కార్యుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిదేమో అనిపించింది' అని అన్నారు. 

ఈ వేదికపై బ్రహ్మనందం.. ప్రభాస్ పేరు ప్రస్తావించగానే అభిమానులు పెద్దఎత్తున సందడి చేశారు. ప్రపంచమంతా గర్వించే నటుల్లో ప్రభాస్‌ ఒకరని అన్నారు. డబ్బు కోసమో.. ఏదో ఒక పాత్ర కోసమో ఆయన ఈ సినిమాని అంగీకరించలేదని తెలిపారు. ప్రభాస్‌ మానవతా విలువలు కలిగిన వ్యక్తి.. ఒక మంచి మనిషి.. ఎవరు చేయి చాచి ఏ సాయం అడిగినా కాదనడు ప్రభాస్‌.. మోహన్‌బాబుకు ఆయన సన్నిహితుడని పేర్కొన్నారు. ప్రభాస్‌ నటన చూడగానే ఇది కదా సినిమా.. ఇది కదా శివభక్తి అని అనిపించిందని బ్రహ్మానందం వెల్లడించారు.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)