Breaking News

బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్‌ భార్య

Published on Fri, 04/28/2023 - 14:07

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. రీల్‌ లైఫ్‌లో తక్కువ ప్రేమకథల్లోనే కనిపించినా రియల్‌ లైఫ్‌లో మాత్రం అతడికి ఓ ఇంట్రస్టింగ్‌ ప్రేమకథ ఉంది. ఆల్‌రెడీ పెళ్లై, కొడుకు ఉన్న బెంగాలీ మహిళ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు.

తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థపూరిత ఆలోచనలు వస్తాయోనన్న భయంతో అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు సంజయ్‌ రావు. ఓ పిట్టకథ సినిమాతో అతడు తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు. తన కొడుకుతో కలిసి నటించాలనుకున్న బ్రహ్మాజీ  ఓ పిట్టకథలో పోలీసుగా నటించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'ఓపక్క మూన్‌ లైట్‌, మరోపక్క సన్‌ రైజ్‌.. హైస్పీడ్‌లో శాశ్వతి దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్‌డేకు నా చైన్‌ తాకట్టు పెట్టాను. తనతో బోలెడంత సేపు ఫోన్‌లో మాట్లాడేవాడిని. దాదాపు నా లైఫ్‌ అంతా పబ్లిక్‌ బూత్‌లోనే గడిచింది. కానీ తను ఒక్కసారి తిట్టిందంటే మూడు రోజులు భోజనం కూడా చేయలేం' అని చెప్పాడు. శాశ్వతి మాట్లాడుతూ.. తమ పెళ్లిలో డైరెక్టర్‌ కృష్ణవంశీ కన్యాదానం చేశాడని చెప్పింది. ఒకసారి బ్రహ్మాజీ సడన్‌గా చేయి కోసుకోవడంతో తాను ఆస్పత్రికి తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: ప్లాస్టిక్‌ సర్జరీ వికటించి మోడల్‌ మృతి
జియా ఖాన్‌​ కేసులో సంచలన తీర్పు

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)