Breaking News

అది చాలా గొప్ప అనుభూతి: బోయపాటి శ్రీను

Published on Wed, 12/17/2025 - 01:35

‘‘అఖండ 2 తాండవం’ని పవర్‌ఫుల్‌గా అన్ని వాణిజ్య అంశాలతో తీశాం. థియేటర్స్‌లో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్‌ చాలా ఆనందాన్నిచ్చింది... గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అఖండ 2’ భారత దేశం ఆత్మ లాంటిది.

అందరికీ చేరాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది... డబ్బు కోసం తీయలేదు. మా సినిమా విడుదల వాయిదా పడినప్పుడు బాలకృష్ణగారి ఫ్యాన్స్‌ ఎలా అర్థం చేసుకుంటారా? అనిపించింది. అంతేకానీ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ కావడం గురించి మేం భయపడలేదు. మా సినిమా ఆడుతున్న థియేటర్స్‌కి వెళ్లినప్పుడు ప్రేక్షకులు నిలబడి విజిల్స్, క్లాప్స్‌ కొట్టడం, చేతులెత్తి దండం పెట్టడం చూశాను. మాకిది చాలా గొప్ప అనుభూతి. ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి మా సినిమాలో చెప్పాం. ‘అవెంజర్స్, సూపర్‌ మాన్, బ్యాట్‌ మాన్‌’... ఇవన్నీ సృష్టించిన పాత్రలు.

కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్‌ కనిపిస్తుంటుంది. మనకంత ఘనమైన చరిత్ర ఉంది. మా సినిమా కర్ణాటక, చెన్నై, హిందీలోనూ ఉర్రూతలూగిస్తోంది. మా మూవీ రెవెన్యూ స్ట్రాంగ్‌గా ఉంది. అయితే హిందీలో థియేటర్ల కొరత ఉంది. మా సినిమాని సెప్టెంబరు 25న రిలీజ్‌ అన్నాం. అయితే అప్పుడు ‘ఓజీ’ సినిమా ఉండటంతో డిసెంబరులో రిలీజ్‌ చేశాం. ‘అఖండ 2’ త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు ఒక్కసారి చూపిస్తే మరోసారి వెళ్దామంటారు’’ అని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)