Breaking News

సినిమా చూడొద్దన్న నాని.. నేడే రిజల్ట్‌!

Published on Thu, 03/13/2025 - 14:18

ఈ మధ్య సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్లా సవాళ్లు విసురుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తమ కథపై వారికి ఉన్న నమ్మకమే అలా మాట్లాడిస్తుంది. అయితే అన్ని సందర్భాలో వారి నమ్మకం ఫలించదు. కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి.మరికొన్ని సార్లు అంచనా వేయలేని విజయాన్ని అందిస్తాయి. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం మేకర్స్‌ అంతా తమది గొప్ప కళాఖండమే అని చెప్పుకోవడంలో తప్పులేదు. చివరికి ఆ సినిమా హిట్టా? ఫట్టా అనేది డిసైడ్‌ చేసేది ఆడియన్‌ మాత్రమే. ఈ విషయం మేకర్స్‌కి కూడా తెలుసు కానీ ఆడియన్‌ని థియేటర్‌కి రప్పించేందుకు ఇలాంటి ‘సవాళ్ల’ని ఎదుర్కొవాల్సిందే. 

తాజాగా హీరో నాని(Nani) ప్రేక్షకులకు విసిరిన సవాల్‌ నెట్టింట బాగా వైరల్‌ అయింది. ఆయన నిర్మించిన ‘కోర్ట్‌’(Court ) సినిమా నచ్చకపోతే ఆయన హీరోగా నటించిన ‘హిట్‌ 3’ సినిమాని చూడకండి అని ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పాడు. ఇక కోర్ట్‌ సినిమాని రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడయాకు ప్రీమియర్‌ వేసి తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. నాని ఊహించినట్లే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కానీ పబ్లిక్‌ ఎలా రియాక్ట్‌ అవుతారనేది నేటి సాయంత్రంతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం పెయిడ్‌ ప్రీమియర్లను వేయబోతున్నారు.

(చదవండి: నాని నిర్మించిన ‘కోర్ట్‌’ మూవీ ఎలా ఉందంటే?)

ఇక నాని ‘కోర్ట్‌’కి పోటీగా బరిలోకి దిగాడు కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ‘దిల్‌రూబా’(Dilruba ) మూవీ కూడా మార్చి 14నే విడుదల కానుంది. ఈ సినిమాపై కిరణ్‌ కంటే ఎక్కువగా ప్రొడ్యూసర్‌ రవినే నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని సవాల్‌ విసిరాడు. ఈయన కామెంట్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు కోర్ట్‌తో పాటు దిల్‌రూబాకి కూడా పెయిడ్‌ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఈ మూవీ రిజల్ట్‌ వచ్చేస్తుంది. సవాళ్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా? లేదా? చూడాలి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)