Breaking News

బిగ్‌బాస్‌ షోలో మైక్‌ టైసన్‌? పారితోషికంపై చర్చలు!

Published on Thu, 08/21/2025 - 19:38

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్‌బాస్‌ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్‌బాస్‌ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్‌ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్‌బాస్‌ అనుకునేరు, కాదు! హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో ఆయన్ను వైల్డ్‌ కార్డ్‌గా ప్రవేశపెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారట!

వైల్డ్‌ కార్డ్‌గా..
పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లో మైక్‌ టైసన్‌ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్‌లో ఉంటాడని సమాచారం. టైసన్‌ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్‌ వస్తుందని బిగ్‌బాస్‌ టీమ్‌ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్‌ ఏమేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి! హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.

తెలుగు సినిమాలో..
కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్‌లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్‌... అందులో 44 బౌట్‌లను నాకౌట్‌ చేశాడు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.

చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)