Breaking News

ఓటీటీలోకి 'బూట్‌ కట్‌ బాలరాజు'.. కనీసం ఇప్పుడైన చూడండయ్యా!

Published on Tue, 02/20/2024 - 11:51

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్‌ కట్‌ బాలరాజు' ఓటీటలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 2న రిలీజ్‌ అయిన ఈ చిత్రాన్ని గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై  సోహైల్‌ నిర్మించాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్‌గా నటించగా.. సునీల్‌, సిరి హన్మంత్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. మార్చి 1 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని ప్రచారం ఉంది. సినిమా విడుదల సమయంలో థియేట‌ర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో సోహైల్‌ ఎమోష‌న‌ల్ అయ్యాడు.. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ కూడా అయ్యాయి. కానీ అప్పటికీ కూడా పెద్దగా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టలేదు. సినిమా కథ బాగున్నప్పటికీ కొత్త దనం లేకపోవడంతో సినిమా ఫెయిల్‌కు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో సోహైల్‌ కామెడీ మరో రేంజ్‌లో ఉంటుంది. పేద‌, ధ‌నిక అంత‌రాల‌తో కథ నడిపించిన తీరు బాగానే ఉన్న కమర్షియల్‌గా పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. థియేటర్‌లో చూడలేకపోయిన వారు ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతూ.. కనీసం ఇప్పుడైన 'బూట్‌ కట్‌ బాలరాజు'పై ఒక లుక్‌ వేయండయ్యా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  మార్చి 1న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలోకి 'బూట్‌ కట్‌ బాలరాజు' వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంట్లోనే చూసేయండి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)