Breaking News

బాలీవుడ్‌పై నాగవంశీ ‍అలాంటి కామెంట్స్‌.. బోనీ కపూర్ ఏమన్నారంటే?

Published on Tue, 12/31/2024 - 17:32

టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాజాగా నిర్వహించిన నిర్మాతల రౌండ్ టేబుల్‌ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌  కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్‌ చిత్రాలను చూసే విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, యానిమల్, జవాన్‌ చిత్రాలతో ఆ మార్పును చూశామని అన్నారు.

అయితే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్ డైరెక్టర్‌ బోనీకపూర్ స్పందించారు. దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉందన్నారు. అలాగే తెలుగు సినిమాలకు యూఎస్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.. అంతేకాకుండా తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలో డిమాండ్ ఉందని తెలిపారు. గల్ఫ్‌ దేశాలతో పోలిస్తే యూఎస్ పెద్ద మార్కెట్‌ అని బోనీ కపూర్ అన్నారు.  అయితే మలయాళ సినిమాకు గల్ఫ్‌లో భారీ మార్కెట్ ఉందని నాగవంశీ అన్నారు.

అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైందన్న నాగవంశీ కామెంట్స్‌ను బోనీ కపూర్ వ్యతిరేకించారు. పుష్ప- 2 హీరో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ ఎన్టీఆర్‌కు బిగ్ ఫ్యాన్‌ అని ‍అన్నారు. దీనికి స్పందిస్తూ.. తాను షారూఖ్‌, అల్లు అర్జున్‌, చిరంజీవికి పెద్ద అభిమానినని నాగవంశీ అన్నారు.

ఇటీవల మీడియాతో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన విషయాన్ని బోనీ కపూర్ గుర్తు చేశారు. సినిమాకు భాష అడ్డంకి కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈరోజు మరాఠీ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని బోనీకపూర్ తెలిపారు. మరాఠీ సినిమా ఈ తరహా బిజినెస్ చేస్తుందని ఎవరూ ఊహిందలేదన్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)