నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు

Published on Thu, 10/30/2025 - 07:11

తమిళనాడులో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయంతో పాటు సినీ నటుడు ప్రభు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమేరకు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్‌ వచ్చింది. అందులో అన్నా ఫ్లైఓవర్‌ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో మరికాసేపట్లో బాంబు పేలుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో ఒక బాంబు పేలుతుందని మెయిల్‌ ద్వారా హెచ్చరించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు. 

తర్వాత అమెరికా కాన్సులేట్‌లో పనిచేస్తున్న అధికారుల ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబులు దొరకలేదు. ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్‌.వి.శేఖర్‌ ఇల్లు, మైలాపూర్‌లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఇళ్లలో బాంబులు పెట్టినట్లు తెలిపారు. వెంటనే తనిఖీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)