Breaking News

'ఆ బాధేంటో నాకు మాత్రమే తెలుసు'.. అత్తారింటికి దారేది నటుడు ఎమోషనల్ పోస్ట్

Published on Wed, 01/29/2025 - 18:57

టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది చిత్రంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు బోమన్ ఇరానీ. ఆ తర్వాత తెలుగులో బెంగాల్ టైగర్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. బోమన్ ఇరానీ చివరిసారిగా షారూఖ్ ఖాన్ మూవీ డుంకీలో కనిపించారు. ప్రస్తుతం ది మెహతా బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా బోమన్ ఇరానీ తన వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య జెనోబియా ఇరానీతో కలిసి 40వ పెళ్లి రోజును ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోమన్ ఇరానీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫరా ఖాన్‌ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది.

బోమన్ ఇరానీ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ ప్రపంచం మొత్తం నిన్ను దేవదూత అని పిలిచినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దీని వెనుక ఉన్న నిజమైన బాధ  ఏంటో నాకు మాత్రమే తెలుసు. మన 40 సంవత్సరాల బంధమే దీనికి నిదర్శనం. కానీ ఇప్పుడు ఆ దేవదూతనే నన్ను ఇంతలా తీర్చిదిద్దింది. అంతేకాదు మా కుటుంబాన్ని తీర్చిదిద్ది మాలో నవ్వులు పూయించి ముందుండి నడిపించింది. 40 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న నా పాత స్నేహితుడిని ఎప్పటికీ ప్రేమిస్తున్నా ఉంటా.' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు విషెస్ తెలిపారు.

కాగా.. బోమన్ ఇరానీ టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, ఖోస్లా కా ఘోస్లా లాంటి సూపర్ హిట్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ది మెహతా బాయ్స్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)