Breaking News

ఆడిషన్ సమయంలో బలవంతం చేశాడు: బుల్లితెర నటి

Published on Fri, 09/06/2024 - 11:48

హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయ్యాక ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ అన్ని చోట్లా ఉందంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో బుల్లితెర నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.

తన కెరీర్ తొలినాళ్లలో ఓ హిందీ చిత్ర నిర్మాత వేధింపులకు గురి చేశాడని బుల్లితెర నటి శిల్పా షిండే ఆరోపించింది. ఆడిషన్ సమయంలో తనపై బలవంతం చేశాడని ఆమె పంచుకుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చేదు సంఘటనను పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లో జరుగుతున్నాయని నటి శిల్పా షిండే అన్నారు.

శిల్పా షిండే మాట్లాడుతూ..' నేను 1998-99లో రోజుల్లో ఇండస్ట్రీలో కష్టపడుతున్నా. ఇప్పుడు నేను వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ఈ దుస్తులు ధరించండి. మీరు ఒక సీన్‌ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ నేను అతను ఇచ్చిన దుస్తులు ధరించలేదు. అంతేకాదు.. ఆ సీన్‌లో అతనే నా బాస్ అని చెప్పాడు. అప్పుడే చాలా అమాయకురాలిని.. అందుకే ఆ సీన్‌కు ఒప్పుకున్నా. కానీ ఆ వ్యక్తి నా మీదికి వచ్చే  ప్రయత్నం చేశాడు. దీంతో నేను భయంతో అతన్ని పక్కకు తోసి బయటకు పరుగెత్తా. అక్కడే ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ అంతా నన్ను చూశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లమన్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా.. భాబీజీ ఘర్ పర్ హైన్ అనే  సిట్‌కామ్‌తో శిల్పా షిండే ఫేమ్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ఖత్రోన్ కీ కిలాడీ రియాలిటీ షో సీజన్‌-14లో పాల్గొంటొంది. 
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?