Breaking News

క్యాన్సర్‌తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్‌!

Published on Fri, 03/08/2024 - 20:19

బాలీవుడ్‌ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్‌తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది.  డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్‌ సోహి కూడా ప్రాణాలు విడిచింది.

అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్‌లెస్‌ కనెక్షన్‌ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్‌ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. 

జాండిస్‌తో ఆమె సోదరి మృతి..

పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్‌) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్‌ సే హి, ఖూబ్‌ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్‌ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది.


 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)