Breaking News

ఒకే ఒక్క ఫ్లాప్‌.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్‌

Published on Thu, 05/21/2026 - 13:50

జ్యోతిక సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అవడానికి ముందు బాలీవుడ్‌లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్‌ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్‌ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

ప్రేమ- పెళ్లి
అయితే కెరీర్‌ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్‌' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్‌ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్‌ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్‌ సంతానం.

ఆదరించని బాలీవుడ్‌
పెళ్లయ్యాక కొంత గ్యాప్‌ తీసుకున్న ఈ హీరోయిన్‌ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్‌ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్‌ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్‌ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!

అదే ప్లస్‌, మైనస్‌
అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్‌లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్‌ సినిమా మే 22న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

చదవండి: డ్రాగన్‌ గ్లింప్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)