Breaking News

'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!

Published on Wed, 03/06/2024 - 19:26

బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. 

ఇదిలా ఉండగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా పెట్టిన తాజా పోస్ట్‌ వైరల్‌గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్‌ చేయనని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు.

అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్‌లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్‌ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్‌కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)