Breaking News

టీనేజ్ అమ్మాయిలా కనిపించాలని లేదు: టబు

Published on Wed, 07/17/2024 - 19:32

అందరివాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ టబు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెప్పించింది. తెలుగులో అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. మూడు దశాబ్దాలకు పైగా తనదైన నటనతో మెప్పిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఔరోన్ మే కహన్ దమ్ థాలో కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తాజాగా టబు ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా మరింత యవ్వనంగా కనిపించనున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి టబు స్పందిస్తూ.. తెరపై టీనేజ్‌ అమ్మాయిలా నటించాలని తనకు లేదని అన్నారు. తాను ప్రస్తుతం ఎలా ఉన్నానో.. అలాగే కనిపిస్తానని వెల్లడించింది. దర్శకుడు నీరజ్ పాండే కూడా తన వయస్సును తగ్గించి చూపే సాహసం చేయలేదని తెలిపింది. 

గతంలో నటీనటులు వయస్సుకి తగిన పాత్రలే చేసేవారని.. ఇటీవలి కాలంలో పాతనటులు సైతం యంగ్‌ పాత్రల్లో నటిస్తున్నారని టబు వివరించింది. కానీ ఈ సినిమాలో నాకు 30 ఏళ్ల అమ్మాయిలా చేయడం ఇష్టం లేదని తెలిపింది. ఈ చిత్రంలో నా వయస్సును దాచే ప్రయత్నం చేయలేదని పేర్కొంది.  కాగా.. ఔరాన్ మే కహన్ దమ్ థా మూవీని రొమాంటిక్‌ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్‌ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేయనున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)