Breaking News

ఆ అవసరం ఇంకా రాలేదన్న చిరంజీవి హీరోయిన్.. రూమర్స్‌పై స్పందించిన నటి!

Published on Mon, 08/05/2024 - 20:58

బాలీవుడ్ భామ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. టాలీవుడ్‌లో మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్‌-2, షాజని, గోల్‌మాల్‌ లాంటి సూపర్ హిట్‌ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్‌ భామ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి.

తాజాగా తనపై వస్తున్న వార్తలపై రిమీ సేన్ స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న కథనాలు అవాస్తవమని తెలిపింది. కేవలం ఫిల్లర్, బోటాక్స్(ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చికిత్స మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రిమీసేన్ పేర్కొంది.

ప్రస్తుతం తనకు ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించింది. తాను అందంగా కనిపించేందుకు వారు ఎంతగానో సహకరిస్తున్నారని రిమీ తెలిపింది. ఇటీవల తన ఫోటోలు చూసి అభిమానులు ఇష్టపడుతున్నారని నటి పేర్కొంది. కాగా.. రిమీ సేన్ చివరిసారిగా 2011లో వచ్చిన షాగిర్డ్‌ చిత్రంలో నటించింది. ఆమె సినిమాకు దూరమై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. బాలీవుడ్‌లో దీవానే హుయే పాగల్, గరం మసాలా, హ్యాట్రిక్, జానీ గద్దర్, దే తాలీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)