Breaking News

నా జీవితంలో 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా: ప్రముఖ సింగర్‌

Published on Sun, 08/04/2024 - 19:22

బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్‌ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. టాప్‌-5లో నిలవాలని ఆశించినప్పటికీ ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్  అయింది. సింగర్‌గా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న నేహా భాసిన్.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసింది. తన ఆరోగ్యానికి సంబంధించి తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంది. నేహా భాసిన్ మల్టీపుల్ డిజార్డర్స్‌తో బాధపడినట్లు వెల్లడించింది. ఆమెకు ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (PMDD), అబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD) ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా రెండేళ్ల క్రితమే ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది.


భాసిన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను  మీకు చాలా చెప్పాలనుకుంటున్నా. కానీ నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని చెప్పేందుకు ఎలా ప్రారంభించాలో తెలియలేదు. కొన్నేళ్ల తర్వాత నా జీవితంలో ఏదో ఆగిపోయిందని తెలిసింది. చివరకు వైద్యపరంగా మరింత అవగాహనతో ఈ రోజు వ్యాధి నిర్ధారణతో మీ ముందుకు వచ్చా. ఇది మానసిక, హార్మోన్ల వ్యాధులకు సరైన చికిత్సలను పొందడంలో సహాయపడుతుంది. వీటన్నింటిలో ప్రధానంగా అవగాహన చాలా ముఖ్యం. ప్రస్తుతానికి నా నాడీ వ్యవస్థ పూర్తిగా విరిగిపోయినట్లు అనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.

శారీరక, మానసిక బాధ, ఆందోళన, డిప్రెషన్‌, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి లాంటి వాటితో ఎక్కువగా బాధపడ్డానని తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో వెనకడుగు వేయలేదని పేర్కొంది. అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ తాను బాధితురాలిని కాదని.. విజేతను అంటూ నేహా భాసిన్ చెప్పుకొచ్చింది. నాలాంటి వారిలో చాలామందికి ఓదార్పునివ్వాలనే ఆశతో తన అనుభవాన్ని పంచుకుంటున్నట్లు పోస్ట్ చేస్తున్నట్లు రాసుకొచ్చింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)