Breaking News

ఎవరికీ చెప్పకుండా చేయించుకున్నా: సెక్రేడ్ గేమ్స్ నటి

Published on Tue, 03/04/2025 - 15:11

సేక్రెడ్ గేమ్స్‌ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్‌కపూర్ ‍హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కుబ్రా సైత్‌ కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. గతంలో తనకు అబార్షన్‌ జరిగినప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఆ సమయంలో తాను ధైర్యం కోల్పోయినట్లు వెల్లడించింది. అది తన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదని తెలిపింది.

ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. 'నేను అబార్షన్‌కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నా. అలా చేయకుంటే బతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి నాకు లేవు. ఆ సమయంలో నేను చాలా బలహీనంగా భావించా. నాకు ఏదో వెలితిగా అనిపించింది. అస్సలు విలువ ఉండదేమో అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది. నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నా. అది కూడా నా సొంత ఆలోచనలకు కట్టుబడి నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను సామాజిక నిబంధనలను ఉల్లంఘించాను అనడానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు' అని వెల్లడించింది. ఓసారి తన స్నేహితురాలతో కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌తో ఈ టాపిక్‌ గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి