Breaking News

'అలాంటి వారు కుక్కలతో సమానం'.. గోవింద భార్య ఘాటు వ్యాఖ్యలు

Published on Tue, 04/08/2025 - 18:05

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో సీనియర్ ‍నటుడు గోవింద పేరు గత కొన్ని నెలలుగా ఎక్కువగా  వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్‌ బై చెప్పనున్నారని ఇప్పటికే చాలాసార్లు వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని తనపై వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అప్పట్లో బాలీవుడ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న గోవింద.. సునీతా అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా సైతం స్పందించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ‍మాట్లాడిన ఆమె మరోసారి వీటిపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరైన సునీతా అహుజా తన వివాహం గురించి జరుగుతున్న ఉహాగానాలు చూస్తుంటే కలతగా ఉందని తెలిపింది. ఇలాంటి నిరాధారమైన వాటిని వ్యాప్తి చేసేవారిని నమ్మవద్దని అభిమానులను కోరింది.

సునీతా మాట్లాడుతూ..'అది పాజిటివ్ అయినా..నెగెటివ్ అయినా.. నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. మాపై ఇలాంటివీ సృష్టించేవారు కుక్కలతో సమానం. అందుకే అవి మొరుగుతాయి." అని కాస్తా గట్టిగానే ఇచ్చిపడేసింది. కాగా.. ఫిబ్రవరిలో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని గోవింద తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.  కానీ వీరికి ‍అత్యంత సన్నిహితుడు కుటుంబ స్నేహితుడై లలిత్ బిందాల్ అనే వ్యక్తి సునీతా అహుజా దాదాపు ఆరు నెలల క్రితమే విడాకుల కోసం దాఖలు చేశారని చెప్పారు. ఆ తర్వాతే విడాకుల రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.

కాగా.. సునీతా అహుజాను మార్చి 1987లో గోవింద వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే కుమార్తె టీనాకు ఆ జంట స్వాగతం పలికారు. వీరికి యశ్వర్ధన్ అనే కుమారుడు 1997లో జన్మించాడు.
 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)