Breaking News

బాలీవుడ్‌ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

Published on Tue, 10/01/2024 - 09:42

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్‌ గాయంతో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం తనకు సంబంధించిన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

బుల్లెట్‌ కాలిలోకి దూసుకెళ్లడంతో అధిక మొత్తంలో రక్తస్రావం అవుతుండటం వల్ల తక్షణమే ఆయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని గోవిందా మేజేజర్‌ తెలిపారు. అయితే, కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉందన్నారు.

గోవిందా  అసలు పేరు  'గోవింద్ అర్జున్ అహుజా'. ఆయన నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, డ్యాన్సర్‌, కమెడీయన్‌గా అందరికీ పరిచయమే. గోవిందా 165కు పైగా చిత్రాల్లో నటించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో  ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి గోవిందా విజయం సాధించారు. అయితే, 2009 వరకు ఎంపీగా కొనసాగిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. 2009 సహా తర్వాతి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. సుమారు 15 ఏళ్ల తర్వాత గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో శివసేన పార్టీలో ఆయన చేరారు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి