ప్రభాస్‌ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?

Published on Thu, 02/13/2025 - 12:40

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ప్రభాస్‌ మారుతి డైరెక్షన్‌లో లవ్ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

ది రాజాసాబ్‌లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్  హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.  

(ఇది చదవండి: ‘ది రాజాసాబ్‌’ అప్‌డేట్‌ .. ప్రభాస్‌ కొత్త లుక్‌ అదిరింది!)

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌, డైరెక్టర్‌తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్‌ బాలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు.
 

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)