Breaking News

ఆ సీన్‌ లేకుంటే ‘యానిమల్‌’ ఇంత పెద్ద హిట్‌ అయ్యేది కాదు: బాబీ డియోల్‌

Published on Thu, 12/14/2023 - 10:14

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. ‘అర్జున్‌ రెడ్డి’ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే దాదాపు 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. యానిమల్‌ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాపై మొదట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, హింస ఎక్కువగా చూపించారంటో కొంతమంది విమర్శించారు.

ముఖ్యంగా బాబీ డియోల్‌ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌.. ఓ సీన్‌లో పెళ్లి వేదికపై పెళ్లికూతురిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా గదిలోకి రమ్మని బలవంతం చేస్తాడు. ఈ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో బాబీ డియోల్‌ని ట్రోల్‌ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై బాబీ డియోల్‌ స్పందించాడు. పాత్ర డిమాండ్‌ మేరకే ఆ సన్నివేశంలో నటించానని, ఆ సీన్‌ లేకుంటే యానిమల్‌ అంత పెద్ద హిట్‌  కాకపోయేదన్నాడు. 

‘పాత్ర తీరుతెన్నులను అర్థం చేసుకొని నటించి ప్రేక్షకులను అలరించడమే నటుల పని. యానిమల్‌లో నేను పోషించిన అబ్రార్‌ హక్‌ పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్న సమయంలో క్యారెక్టర్‌ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థం కావాలనే అలాంంటి సీన్స్‌ క్రియేట్‌ చేశారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే సినిమాల్లో కనిపిస్తాయి తప్ప.. వాటిని సినిమాలు ప్రమోట్‌ చేయట్లేదు’ అని బాబీ డియోల్‌ చెప్పుకొచ్చాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)