Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ

Published on Sun, 12/08/2024 - 09:45

ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం కేవలం తమిళ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్‪‌లోకి రాగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు కూడా ఉంది. ఇంతకీ ఇదే సినిమా? తెలుగు వెర్షన్ ఎందులో ఉంది?

'జైలర్' దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ సినిమా 'బ్లడీ బెగ్గర్'. కవిన్ హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ.. తెలుగులో నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. తొలుత దీని తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)

ప్రస్తుతానికి మన దగ్గర తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లోనూ 'బ్లడీ బెగ్గర్' మూవీ తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి.

'బ్లడీ బెగ్గర్' విషయానికొస్తే.. కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). ఓ రోజు దినం భోజనాల కోసమని ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. తిరిగి ఇంటికి వెళ్లకుండా దొంగచాటుగా బంగ్లాలోకి దూరుతాడు. కాసేపు బాగానే ఎంజాయ్ చేస్తాడు కానీ ఊహించని విధంగా లోపల ఇరుక్కుపోతాడు. తర్వాత ఏమైంది? బంగ్లా ఓనర్స్ ఇతడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)