ఇదెక్కడి విడ్డూరం.. బిర్యానీ కట్‌ చేసి.. ఇలా కూడా చేస్తారా?

Published on Wed, 07/23/2025 - 14:51

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవలే మార్గన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. మరో మూవీతో వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న భద్రకాళి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్‌ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది విజయ్ ఆంటోనీ కెరీర్‌లో 25వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా భద్రకాళి మూవీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య ‍అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో విజయ్ ఆంటోని బర్త్‌ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈవెంట్‌లో కేక్‌కు బదులు బిర్యానీని కట్‌ చేసి రోటీన్‌కు భిన్నంగా బర్త్‌ డే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు కేక్‌ ప్లేస్‌లో బిర్యానీ ఏంటని కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. 'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో 'భద్రకాళి' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)