Breaking News

18 ఏళ్లకే పెళ్లి, సీక్రెట్‌గా ఉంచా: బాలీవుడ్‌ నటి

Published on Thu, 05/11/2023 - 08:28

ప్రత్యేక గీతాలకు పెట్టింది పేరు బిందు. బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించి, తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది బిందు. దాదాపు 40 ఏళ్లపాటు ఇండస్ట్రీకి తన సేవలందించిన ఆమె తర్వాత సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

'మా పొరుగింట్లో ఉండే చంపక్‌ లాల్‌ జవేరీ, నేను 15 ఏళ్ల వయసులోనే ప్రేమించుకున్నాం. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. ఎందుకంటే పెళ్లి వల్ల నా వర్క్‌ డిస్టర్బ్‌ అవ్వద్దనుకున్నాను. 1979లో దొ రాస్తే సినిమా ఆఫర్‌ వచ్చింది. అప్పుడు మా ఆయనుండి.. మనం ఆర్థికంగా సెటిలయ్యాం కదా, ఇప్పుడిది అవసరమా? అన్నారు. కానీ నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం ఉందని చెప్పడంతో మరేం మాట్లాడలేదు. నాకు అండగా నిలబడ్డారు.

నేనెప్పుడూ ఏ పార్టీకి ఒంటరిగా వెళ్లలేదు. అతడితో కలిసే పార్టీలకు హాజరయ్యేదాన్ని. అలాగే లేట్‌ చేయకుండా ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. తను నా విషయంలో ఎప్పుడూ అభద్రతకు లోనవలేదు. నేను తనను ఎంత ప్రేమిస్తున్నానో ఆయనకు తెలుసు. అందుకే నాపై పూర్తి నమ్మకం ఉంచారు.' అని చెప్పుకొచ్చింది నటి. కాగా బిందు దాదాపు 160 చిత్రాల్లో నటించింది. కటి పతంగ్‌, ఇత్తేఫక్‌, దో రాస్తే, అభిమాన్‌ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె చివరగా 2008లో వచ్చిన మెహబూబా సినిమాలో కనిపించింది.

చదవండి: 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)