Breaking News

బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారం.. నాకు వచ్చిన ఆఫర్స్‌ మరెవరికీ రావు: బిగ్‌బాస్‌ ఆదిరెడ్డి

Published on Mon, 03/31/2025 - 20:07

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్‌-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా  బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.

అయితే ఇటీవల టాలీవుడ్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.

నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్‌ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్‌కు సూచించారు.

అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్‌ మన ఇండియాలో లీగల్‌గానే చేశారని తెలిపారు.  ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. ‍అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్‌ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు.  2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు.  అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్‌లలో  కేవలం ఉచిత లీగ్‌లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్‌ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)