Breaking News

ప్రియురాలిని పెళ్లాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Published on Thu, 11/27/2025 - 13:13

టాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) పెళ్లి పీటలెక్కాడు. ప్రియురాలు హరణ్య మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో గురువారం (నవంబర్‌ 27న) ఉదయం ఈ వివాహ వేడుక జరిగింది. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాహుల్‌ ప్రస్థానం
హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో మధ్య తరగతి కుటుంంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ జన్మించాడు. అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తి గమనించిన తండ్రి గజల్‌ మాస్టర్‌ వద్దకు తీసుకెళ్లాడు. ఓవైపు సంగీతంలో శిక్షణ తీసుకుంటూ మరోవైపు తండ్రికి సాయంగా బార్బర్‌ షాప్‌లో పని చేశాడు.

ఫేమస్‌ సాంగ్స్‌
కాలేజీ బుల్లోడ.. వాస్తు బాగుందే.. ఈగ టైటిల్‌ సాంగ్‌.. సింగరేణుంది బొగ్గే పండింది, రంగా రంగా రంగస్థలానా.. బోనాలు ఇలా అనేక సాంగ్స్‌ పాడాడు. మంగమ్మ, పూర్‌ బాయ్‌, గల్లీకా గణేశ్‌, దావత్‌ వంటి పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించాడు. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు పాట అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

చదవండి: రూ.50 లక్షలు పెడ్తే  రూ.88 లక్షలు కలెక్షన్స్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)