Breaking News

బిగ్‌బాస్‌ హౌస్‌లో దెయ్యం.. భయంతో వణికిపోయిన హౌస్‌మేట్స్!

Published on Wed, 10/23/2024 - 15:32

తెలుగులో బిగ్‌బాస్‌ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారంలోనే మణికంఠ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే సోమ, మంగళ వారాల్లో నామినేషన్స్ గొడవలతో ఓ రేంజ్‌లో సాగింది. ఈ వారంలో  ఈ వారం నిఖిల్‌, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్‌, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక టాస్కుల గోల మొదలు కానుంది. అయితే ఈ సారి హౌస్‌లో ఊహించని సంఘటన జరిగింది. హౌస్‌మేట్స్‌ను నిద్రపోకుండా చేసేలా పెద్ద స్కెచ్‌ వేశారు. ముగ్గురు కలిసి హౌస్‌మేట్స్‌ను వణికించేశారు. అదేంటో తెలుసుకుందాం.

హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా లేచి బయటకు పరిగెత్తారు. ఇంతకీ ఏం జరుగుతోంది అంటూ అంతా భయపడిపోయారు. గంగవ్వను చూసిన హౌస్‌మేట్స్‌ ఓ రేంజ్‌లో వణికిపోయారు. ఆ తర్వాత అవ్వను ధైర్యంతో మెల్లగా గదిలోకి తీసుకెళ్లిన టేస్టీ తేజ తన బెడ్‌పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అంతా కలిసి దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. నాకైతే నిద్ర కూడా రావడం లేదంటూ రోహిణి, హరితేజ తెగ చర్చించుకున్నారు.

అయితే ఆ తర్వాత ఫ్రాంక్‌ అని తెలిసిపోయింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వీళ్లు ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. 
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)