Breaking News

ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!

Published on Thu, 10/03/2024 - 23:07

బిగ్‌బాస్‌ హౌస్‌కు కొత్త చీఫ్‌ సెలక్ట్‌ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్‌ అఫ్రిది చీఫ్‌ పోస్ట్‌ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్‌ 3) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

పోరాడి ఓడిన ప్రేరణ
హ్యాపీ పప్పీ టాస్క్‌లో నబీల్‌, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్‌ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్‌ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్‌ చీఫ్‌ కంటెండర్‌గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్‌లకు బిగ్‌బాస్‌ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్‌ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.

ఫ్రెండ్‌ అని ఊరుకున్నా..
ఆలస్యంగానైనా నబీల్‌ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్‌కే ఫేవర్‌ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్‌ అని సైలెంట్‌గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్‌, పృథ్వీ దగ్గర ఫైర్‌ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్‌ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.

లేడీస్‌ గ్యాంగ్‌ ఏడుపు
రాత్రిపూట బిగ్‌బాస్‌ మిడ్‌వీక్‌ ఎలిమినేషన్‌ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్‌లో ఉన్నవారిలో నిఖిల్‌, నబీల్‌, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్‌ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్‌బాస్‌.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు.

ఆదిత్య ఎలిమినేట్‌
కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్‌ అవుతాడని నిఖిల్‌ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్‌ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్‌ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్‌ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్‌బాస్‌.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్‌ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్‌ కిస్‌ వదిలి హౌస్‌ నుంచి నిష్క్రమించాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)