Breaking News

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీని బయటపెట్టిన పృథ్వీ.. సూర్యకు సర్‌ప్రైజ్‌

Published on Sat, 10/26/2024 - 23:41

గంగవ్వ అర్ధరాత్రి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన వీడియో ప్లే చేసిన నాగ్‌ అది కేవలం ప్రాంక్‌ అని బయటపెట్టాడు. ప్రైజ్‌మనీలో అరలక్ష పోయినా నామినేషనే ముఖ్యమనుకున్న నబీల్‌పై పోయిన డబ్బును తీసుకొచ్చే బాధ్యతను వేశాడు. హీరో సూర్య నేటి (అక్టోబర్‌ 26) ఎపిసోడ్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..

ఇవే తగ్గించుకుంటే మంచిది
ఘోస్ట్‌ ప్రాంక్‌లో గంగవ్వ యాక్టింగ్‌కు ఇంప్రెస్‌ అయిన నాగ్‌ ఆమెను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి మరీ సీక్రెట్‌గా మెచ్చుకున్నాడు. పృథ్వీ ప్రాణం పెట్టి సింహంలా ఆడాడని పొగిడాడు. అయితే నామినేషన్స్‌లో రోహిణిని కింది నుంచి పైకి చూస్తే అది బాడీ షేమింగ్‌లానే కనిపిస్తుందని.. దాన్ని మార్చుకోమని సూచించాడు. పృథ్వీ- నిఖిల్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ హీరోల్లా కలిసి ఆడారని క్లాప్స్‌ కొట్టాడు. 

నీ వల్ల అరలక్ష గోవిందా..
ప్రైజ్‌మనీలో రూ.50 వేలు కట్‌ అవుతాయని తెలిసినా హరితేజను నామినేట్‌ చేశావు. ఆ అర లక్ష మళ్లీ ప్రైజ్‌మనీలో జమ చేయాల్సిన బాధ్యత నీదేనని నబీల్‌కు నొక్కి చెప్పాడు. గౌతమ్‌ గురించి మాట్లాడుతూ.. మహిళలపై గౌరవం ఉందని చెప్పే నువ్వు యష్మిపై ఎందుకు అరిచావ్‌? నీ షార్ట్‌ టెంపర్‌ తగ్గించుకో అని సలహా ఇచ్చాడు.

ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ
తర్వాత నిఖిల్‌- యష్మి - గౌతమ్‌ల ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీని నాగ్‌ బయటపెట్టాడు. హౌస్‌లో జరిగిన టీ షర్ట్‌ వ్యవహారం గురించి పృథ్వీ చెప్తే ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్‌ చేస్తానని నాగ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఇంకేముంది, ఫ్రెండ్‌షిప్‌ను పక్కన పెట్టి పృథ్వీ లేచి నిల్చున్నాడు. గౌతమ్‌ టీషర్ట్‌ కావాలని యష్మి అడిగింది. నిఖిల్‌ టీషర్ట్‌ లేదు కాబట్టి గౌతమ్‌ది వేసుకుంది. అప్పుడు నిఖిల్‌ జెలసీ ఫీల్‌ అవుతున్నాడని యష్మి నాతో చెప్పింది. అక్కడినుంచి ఏమైనా ఉందా? అని అడిగింది అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు.

యష్మికి గడ్డి పెట్టిన నాగ్‌
రాయల్‌ టీమ్‌లో విభేదాలున్నాయని.. అవన్నీ పక్కనపెట్టి ఓజీ టీమ్‌లా ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక నిఖిల్‌ చుట్టూ తిరిగిన యష్మిని.. ఎవరి చుట్టూనో తిరగడం మానేయ్‌, మళ్లీ గేమ్‌కు వచ్చేయమని సూచించాడు. అలాగే సంచాలకురాలిగా నా స్ట్రాటజీ నాకుంటుంది, నా గ్రూపును నేను గెలిపించుకోవాలనడం తప్పు అని కుండబద్ధలు కొట్టాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన యష్మి నాకు ఏ స్ట్రాటజీ లేదంటూ కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నించింది.

అప్పుడు కెమెరామన్‌, ఇప్పుడు డైరెక్టర్‌
ఇక గంగవ్వ దెయ్యంగా మారి భయపెట్టింది ప్రాంక్‌ అని.. ఈ ఐడియా అవినాష్‌, తేజదని వీడియోతో సహా క్లారిటీ ఇచ్చాడు నాగ్‌. తర్వాత కంగువా ప్రమోషన్స్‌ జరిగాయి. అందులో భాగంగా హీరో సూర్య, దర్శకనిర్మాత స్టేజీపైకి వచ్చాడు. డైరెక్టర్‌ అవ్వకముందు నాగార్జున నటించిన నేనున్నాను, బాస్‌: ఐ లవ్యూ సినిమాలకు శివ కెమెరామెన్‌గా నటించాడు. ఆ సమయంలో ఒకరోజు నాగ్‌ పిలిచి.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్‌ అవుతావన్నాడు అని చెప్పుకొచ్చాడు.

సూర్య కోసం వచ్చేందుకు రెడీ
సూర్య వస్తున్నాడని తెలిసి నయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట! ఇక హౌస్‌మేట్స్‌ అందరూ సూర్య పాటలకు డ్యాన్స్‌ వేసి అతడిని సర్‌ప్రైజ్‌ చేశాడు. సూర్యను కలవడానికి హౌస్‌ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావా? అని నాగ్‌ అడగ్గా తప్పకుండా వస్తాను సర్‌ అంటూ నయని మెలికలు తిరిగిపోయింది. పృథ్వీ కోరిక మేరకు సూర్య.. రోలెక్స్‌ డైలాగ్‌ చెప్పాడు. తర్వాత బై చెప్పివెళ్లిపోయాడు.

డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో గొడవ
అయితే డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో యష్మి హర్టయిందట! ప్రాక్టీస్‌ మీద ఆసక్తి చూపించడం లేదు, నీకసలు డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ ఎవరు కావాలి? అని విష్ణు పృథ్వీని అడిగగింది. అందుకతడు ఎవరైనా ఓకే అన్నాడు. దీంతో హర్టయిన విష్ణు.. నేను, పృథ్వీ కంఫర్ట్‌గా లేము బిగ్‌బాస్‌. పార్ట్‌నర్స్‌ మార్చుకునే వీలుందా? అని అడిగింది. దీంతో బిగ్‌బాస్‌ నిఖిల్‌ -యష్మిని విడదీశాడు. నిఖిల్‌తో విష్ణు, యష్మితో పృథ్వీ కలిసి డ్యాన్స్‌ చేయాలన్నాడు.

బిత్తరపోయిన విష్ణు
ఇది యష్మికి అస్సలు నచ్చలేదు. తన కోసం నా ఆనందాన్ని చెడగొడుతోందని ఏడ్చేసింది. నువ్విలా చేస్తావని ఊహించలేదంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది. దీంతో బిత్తరపోయిన విష్ణు.. పృథ్వీతో డ్యాన్స్‌ చేసేందుకు ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)