Breaking News

పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?

Published on Thu, 11/07/2024 - 23:42

డంబ్‌.. ఈ ఒక్కమాటతో విష్ణుప్రియ పృథ్వీపై కోపం పెంచుకుంది. లాగి పెట్టి కొట్టాలన్నంత కోపమొచ్చింది. అతడికి ఆ మాట అన్నాడని కూడా గుర్తు లేదట.. అయినా సారీ చెప్పడంతో విష్ణు ఇట్టే కరిగిపోయింది. తాను కూడా ఏమైనా హర్ట్‌ చేసుంటే సారీ అంటూ మళ్లీ అతడి మాయలోనే పడింది. మరి హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్‌ 7) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

తప్పులో కాలేసిన యష్మి
బిగ్‌బాస్‌ చిట్టచివరగా స్క్రూను తిప్పు-కంటెండర్‌ పట్టు అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియను ఓడించి యష్మి విజేతగా నిలిచి కంటెండర్‌ బ్యాడ్జ్‌ ధరించింది. అయితే పొరపాటున యష్మి.. తన సూట్‌కేస్‌కు బదులు విష్ణు సూట్‌కేస్‌ తెచ్చి ఓపెన్‌ చేసింది. అందులో ఉన్న రూ.75 వేలున్నాయి. అంతలోనే తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న యష్మి.. తప్పయిపోయింది బిగ్‌బాస్‌ అంటూ తన ఒరిజినల్‌ సూట్‌కేస్‌ ఓపెన్‌ చేసింది. అందులో రూ.1,84,000 ఉన్నాయి. కానీ బిగ్‌బాస్‌ దానికి ఒప్పుకోకుండా ముందుదాని ప్రకారం రూ.75 వేలను ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశాడు.

పృథ్వీ, విష్ణు మధ్య దూరం
మరోవైపు పృథ్వీ ప్రవర్తనకు విష్ణుకు చిర్రెత్తిపోయింది. నన్ను డంబ్‌ అన్నాడు. నన్ను హర్ట్‌ చేసి తను మాత్రం సంతోషంగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నాకొద్దు. ఫస్ట్‌ టైమ్‌ అతడికి పంచ్‌ ఇవ్వాలనిపించింది అని తన కోపాన్ని, బాధనంతా యష్మి ముందు కక్కేసింది. ఇంతలో పృథ్వీ అటుగా రావడంతో యష్మి.. వీరిద్దరికీ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించింది. ఆమెకు సారీ చెప్పమని అడిగింది. 

మనసులో స్థానం కోల్పోయాడంటూ భారీ డైలాగ్స్‌
అతడు నో అనేసరికి నేనేమీ సారీ అడగలేదని విష్ణు అంది. అది విన్న పృథ్వీ.. నేను నీతో మాట్లాడట్లేదు అని సీరియస్‌గా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కోపం వల్లే అతడు తన మనసులో స్థానం కోల్పోయాడని విష్ణు నిఖిల్‌తో చెప్పింది. చివరకు పృథ్వీ సారీ చెప్పడంతో విష్ణు ఆవేశమంతా చప్పున చల్లారింది. బిగ్‌బాస్‌ ఓ ఫన్‌ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా అవినాష్‌ ఫేమస్‌ డైరెక్టర్‌, రోహిణి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

ఏబీసీ.. సినిమా
వీరిద్దరూ ఆడిషన్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌కు వస్తారు. ఇంకేముంది.. హౌస్‌మేట్స్‌ తమ కళలు చూపిస్తూ ఛాన్స్‌ పొందాలని ప్రయత్నించారు. ఏబీసీ అనే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా.. అక్కా బావ ఎక్కడ? అనేది క్యాప్షన్‌ అన్నాడు అవినాష్‌. సినిమా పేరుకు తగ్గట్లే ఓ రియల్‌ సీన్‌ చేసి చూపించారు నిఖిల్‌, యష్మి, గౌతమ్‌. ఈ క్రమంలో గౌతమ్‌.. యష్మిని అక్కా అని పిలిస్తే నిఖిల్‌ వద్దని వారించాడు. 

యష్మిని అక్కా అని పిలుస్తావా?
దీంతో గౌతమ్‌.. సరే నేను పిలవను, మరి నువ్వు యష్మిని అక్కా అని పిలుస్తావా? అని ప్రశ్నించాడు. ఈ మాటతో అక్కడున్న అందరూ పడీపడీ నవ్వారు. ఇలా ఫన్‌ టాస్క్‌ ద్వారా కిచెన్‌ టైమర్‌కు మరో రెండు గంటలు జమైంది. పృథ్వీ తనకు అక్కర్లేదన్న విష్ణుప్రియ చివరకు అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పి మళ్లీ అతడి మైకంలోనే పడిపోయింది.

మూట ముఖ్యం బిగిలు 
మెగా చీఫ్‌ కంటెండర్లు రోహిణి, ప్రేరణ, నబీల్‌, పృథ్వీ, యష్మిలకు మూట ముఖ్యం బిగిలు అన్న గేమ్‌ ఇచ్చాడు. ఎవరు చీఫ్‌ కాకూడదని కోరుకుంటున్నారో వారి డబ్బాలో హౌస్‌మేట్స్‌ మూటలు వేయాలన్నాడు. అలా మొదటి రౌండ్‌లో యష్మి, రెండో రౌండ్‌లో నబీల్‌ ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్‌ ముగిసింది. ఇకపోతే ప్రేరణ మెగా చీఫ్‌ అయినట్లు సమాచారం.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)