Breaking News

బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ...'కవరేజ్ ఫుల్లు, కంటెంట్ నిల్లు'

Published on Mon, 12/09/2024 - 14:06

బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆఖరి దశకు వచ్చింది. అలాగే బిగ్ బాస్ ప్రోగ్రామ్‌లో కంటెంట్ కూడా బాగా తగ్గిందనే విషయం ఈ వారం ఇంకా బాగా కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ వారం ఆరంభం ఆఖరి నామిమేషన్స్ తో మొదలవగా టాప్ 5 ఫైనలిస్టులతో వారం ముగిసింది. ఆఖరి నామినేషన్స్ కాబట్టి, కంటెస్టెంట్స్ వాళ్ళ వాడే భాష డోసు పెంచి (అంటే పరుషపదజాలం వాడుతూ) బిగ్ బాస్‌కు కాస్త ఆనందం కలిగించారు. ఒక్క అవినాష్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. ఇంక అవడానికి, చేయడానికి ఎవరూ లేరు కాబట్టి. దాని తరువాత ఓట్ అప్పీల్ కోసం కొన్ని వింత టాస్కులతో ఆఖరి దశలోని ఓ వివాద అంకాన్ని పూర్తి చేశాడు బిగ్ బాస్. 

హౌస్‌లో వున్న కంటెస్టెంట్స్ దగ్గర కంటెంట్ ఇక రాదు అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ బయట నుండి పర్ఫామర్స్‌ని తెప్పించి అటు కంటెస్టెంట్స్‌ను ఇటు ఆడియన్స్‌ను మెప్పించడానికి ప్రయత్నించాడు బిగ్ బాస్. కంటెంట్ లేక ఫుల్ కవరేజ్ కోసం వీకెండ్‌లో కాస్త ఓవరాక్షన్ టాస్కులను కంటెస్టంట్స్ చేత చేయించి మితిమీరాడు బిగ్ బాస్. దానిలో భాగంగా డాన్స్ టాస్కులలో మన సంస్కృతికి మణిహారమైన సాగరసంగమం చిత్రంలోని తకిటతథిమి... పాటను అసభ్యకరమైన పోల్ డాన్సు రూపాన వికృత భంగిమలతో నాట్యం చేయించడం ఒకటైతే, సంప్రదాయమైన నాట్య రూపాలతో హేయమైన ఊ... అంటావా ఊహూ అంటావా... పాటలతో చేయించడం రెండోది. 

కంటెంట్ కోసం వినూత్నంగా విభిన్నంగా ఆలోచించి ఆచరించడం మంచిదే, కాని ఇలాంటి విపరీత, వింత పోకడలతో వినోదాన్ని పంచడం ఎంతవరకు సబబు. నాలుగు డబ్బులు కోసం మన సంస్కృతిని కించపరిచేంత దిగజారాలా బిగ్ బాస్. ఎంత కంటెంట్ నిల్లయితే మాత్రం కవరేజ్ కోసం ఇటువంటి కతలవసరమా.. ఇంకో వారం ఇంకెలాంటి విడ్డూరాలు చూడాల్సివస్తుందో...
- హరికృష్ణ ఇంటూరు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)