రెమ్యునరేషన్‌ దగ్గర బేరాలు, వాళ్లు అవుట్‌.. బిగ్‌బాస్‌ 7లో హీరో శివాజీ!

Published on Fri, 09/01/2023 - 19:06

ఓటీటీల ప్రభావమో, ఇతర రియాలిటీ షోల ఎఫెక్టో కానీ బిగ్‌బాస్‌కు ఆదరణ తగ్గుతూ వస్తోంది. దీంతో ఎలాగైనా మునుపటి క్రేజ్‌, టీఆర్పీ దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది బిగ్‌బాస్‌ టీమ్‌. అందుకే ఈసారి చిత్రవిచిత్ర పనులు చేస్తోంది. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్‌ 7 ప్రారంభం కాబోతోంది. సాధారణంగా అయితే ఈపాటికే కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌ బయటకు వచ్చేస్తుంది.

కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్‌ టీమ్‌ ఎత్తుకుపైఎత్తు వేసింది. చివరి నిమిషంలో కొందరిని రిజెక్ట్‌ చేసింది, మరికొందరితో రెమ్యునరేషన్‌ బేరాలు ఆడి వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేసింది. దీంతో ఇప్పటిదాకా వైరలవుతూ వచ్చిన లిస్ట్‌ కాస్త తారుమారు అయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొగలి రేకులు సాగర్‌, అంజలి పవన్‌ రెమ్యునరేషన్‌ దగ్గర బెట్టు చేశారని, వీళ్లు డిమాండ్‌ చేసినంత ఇవ్వకపోవడంతో బిగ్‌బాస్‌ ఆఫర్‌ రిజెక్ట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కొద్దోగొప్పో పేరున్న సెలబ్రిటీలు సైడ్‌ అయిపోతే బిగ్‌బాస్‌కు పెద్ద దెబ్బే.. అందుకని ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు శివాజీని రంగంలోకి దింపుతున్నారట! మొదట ఈయన వచ్చే ఛాన్స్‌ చాలా తక్కువగా ఉందని ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు ఎక్కువ పారితోషికం ఇచ్చైనా సరే హౌస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి శివాజీ నిజంగానే బిగ్‌బాస్‌లో అడుగుపెడతాడా? తన ముక్కుసూటి వైఖరితో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటాడా? లేదంటే అందరినీ ఓ ఆటాడిస్తాడా? అనేది చూడాలి!

చదవండి: రాఖీ.. బేబి హీరోయిన్‌కు తమ్ముడు ఏం గిఫ్టిచ్చాడో తెలుసా?

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)