Breaking News

బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్‌ సపోర్ట్‌ ఎవరో తెలిస్తే

Published on Mon, 07/17/2023 - 09:58

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్స్‌ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో.. త్వరలోనే ఏడో సీజన్‌ని ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా వదిలారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. షోలో పార్టీసిపెట్‌ చేసేందుకు చాలామంది జాబితానే వారు సిద్దం చేశారని తెలుస్తోంది. కానీ వారిలో కొందరికి మాత్రమే ఫైనల్‌​ ఎంట్రీ అవకాశం ఉంటుందనేది అందరికీ తెలిసిందే.

(ఇదీ చదవండి: ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్‌ ట్వీట్‌.. ఆమెపై బూతులతో రెచ్చిపోతున్న ఆయన ఫ్యాన్స్‌)

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట హోస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. బుల్లితెరలో గుర్తింపు తెచ్చుకున్న అమర్‌దీప్-తేజస్వినిల వివాహం  డిసెంబర్‌ 2021న బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే. అమర్‌దీప్‌కు దగ్గరి స్నేహితులైన సయ్యద్‌ సోహెల్‌, అరియాన, ప్రియాంక సింగ్‌ వంటి వారు పెళ్లికి హాజరయ్యారు.

'ప్రతి సంవత్సరం, మేకర్స్ షోలో కనీసం ఒక సెలబ్రిటీ జంటను ఉంచేందుకు ప్లాన్‌ చేస్తారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ హిందీ వెర్షన్‌లో కూడా ఈ ట్రెండ్‌ను ఎక్కువగా అనుసరిస్తోంది. అందుకే, తెలుగు నుంచి బుల్లితెరలో పాపులర్‌ అయిన  అమర్‌దీప్-తేజస్విని గౌడను స్టార్‌ మా సంప్రదించారని తెలుస్తోంది. 

'జానకి కలగనలేదు'  సీరియల్‌తో రామగా పాపులర్ అయ్యారు నటుడు అమర్‌దీప్. ఈ సీరియల్‌‌తో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది.  మరోవైపు, 'కేరాఫ్ అనసూయ' సీరియల్‌తో పాపులర్ అయిన నటి తేజస్విని గౌడ. వీరిద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు.  తేజస్విని కన్నడ టీవీ షోలలో కూడా నటించిడంతో అక్కడ మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది.

ఈ జంట గత సీజన్‌లోనే అడుగుపెట్టబోతుందని బాగానే ప్రచారం జరగింది. కానీ ఈసారి పక్కాగా వీరిద్దరి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ జంట షోలో అడుగుపెడితే సయ్యద్‌ సోహెల్‌, అరియాన సపోర్ట్‌ ఈ జంటకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: లిప్‌లాక్‌,బోల్డ్‌ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)