Breaking News

బిగ్‌బాస్‌ 7: సడన్‌గా హౌస్‌లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్‌!

Published on Mon, 10/09/2023 - 15:27

బిగ్‌బాస్‌ షో.. లోనికి వెళ్లడమే కంటెస్టెంట్ల చేతిలో ఉంటుంది. బయటకు రావడమనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వారి ఆట నచ్చినంతవరకు కంటెస్టెంట్లను ముందుకు నడిపిస్తూ ఉంటారు. నచ్చని మరుక్షణం ఓట్లు వేయడం మానేసి ఎలిమినేట్‌ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం బిగ్‌బాస్‌ స్వయంగా కంటెస్టెంట్లను అవతలకు పంపించి వేస్తూ ఉంటాడు.

ఒక షో.. రెండు ఇళ్లు
ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, హౌస్‌లో ఉండలేకపోతున్నామని పోరు పెడితే ఉన్నపళంగా గేట్లు ఎత్తి వెళ్లిపోమంటాడు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా తమిళ బిగ్‌బాస్‌ 7వ సీజన్‌లోనూ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్టోబర్‌ 1వ తేదీన తమిళ బిగ్‌బాస్‌ 7 ప్రారంభమైంది. ఈ షోలో రెండు హౌస్‌లు ఉన్నాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్న ఇల్లు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లను చిన్న ఇంట్లో పెట్టి వారితో పనులు చేయిస్తారు. చిన్న ఇంట్లో ఉన్నవారు ఏ టాస్కుల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు.

ఆరోగ్యం సహకరించడం లేదంటూ..
రచయిత, నటుడు బావ చెల్లదురై గతవారం నామినేషన్‌లో ఉండటంతో తనకు కూడా వంట చేయడం, క్లీనింగ్‌ వంటి పనులు తప్పలేదు. ఈ క్రమంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని బిగ్‌బాస్‌కు చెప్తూ తనను పంపించేయమని వేడుకున్నాడు చెల్లదురై. తన శారీరక, మానసిక ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మొర పెట్టుకున్నాడు.

తండ్రిలా చూసుకున్నారు, కానీ..
బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పమని బిగ్‌బాస్‌ అన్నప్పటికీ తాను వెళ్లిపోవాలన్న మాటకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. 'నేను ఇక్కడ ఇండలేను. ఇంకా ఆలోచించడానికేం లేదు. కంటెస్టెంట్లు నన్ను తండ్రిలా చూసుకున్నారు. కానీ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. ప్లీజ్‌, వెళ్లిపోతాను' అని అభ్యర్థించాడు. దీంతో బిగ్‌బాస్‌ తన కోరిక మేరకు బావ చెల్లదురైని ఇంటి నుంచి పంపించేశాడు.

చదవండి: బతుకమ్మ ఆడిన హీరోయిన్స్‌.. నెట్టింట వీడియో వైరల్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)