Breaking News

40 రోజులుగా బ్లీడింగ్‌.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి

Published on Thu, 11/14/2024 - 18:13

 బిగ్ బాస్ ఫేమ్, యాంక‌ర్  స్రవంతి చొక్కారపు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. సోషల్‌ మీడియా నుంచి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ల‌లో  యాంకరింగ్‌ చేసే స్థాయికి ఆమె చేరుకుంది. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి ఒక పోస్ట్‌ చేసింది. తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొంది. దీంతో తన అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి తన అనారోగ్యం గురించి ఇలా చెప్పింది. 'నేను అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పలేదు,కేవలం అవగాహన కోసం మాత్రమే ఇలా చెబుతున్నాను. ముఖ్యంగా 'ఆడవారి కోసం' చెబుతున్నాను. 35 నుంచి 40 రోజులుగా నాకు విపరీతమైన బ్లీడింగ్ అవుతూనే ఉంది.రకరకాల మెడిసిన్ వాడాను,డాక్టర్‌ని డైరెక్ట్‌గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేపించుకోలేదు. ఒక రోజు షూటింగ్‌ ఉదయం 6:45 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2:45 వరకు జరిగింది. దీంతో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లాను. 

అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని ,వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, గతంలో మాదిరి నేను పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు రావాలంటే కనీసం 4 నుంచి 5 వారాలు పడుతుంది. ఇదే విషయాన్ని వైద్యులు సూచించారు. షూటింగ్‌ లేదా మీ ఇతర పనుల కోసం అని ఎక్కువ సమయం కేటాయించకండి. అనారోగ్యంతో పనిలోకి వెళ్లడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరగొచ్చు. మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే.. మీ అరోగ్యానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వండి. నిర్లక్ష్యం చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి.ఇవన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి.' అని ఆమె పేర్కొంది. స్రవంతి గర్భాశయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్‌ స్రవంతి చొక్కారపు. సోషల్‌ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం. బిగ్‌బాస్‌ స్టేజీపై  కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన స్మైల్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)