Breaking News

8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్‌ బాస్‌ బ్యూటీ అరెస్ట్‌

Published on Fri, 03/22/2024 - 13:35

కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్‌ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని  బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమాజంలో  సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని  మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్‌కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్‌తో పాటు.. యూట్యూబ్‌ కోసం పలు వీడియోలను  సోనూ క్రియేట్‌ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు.

బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు  సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు.  

రాయచూర్‌కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)