Breaking News

బిగ్‌ బాస్‌ అమర్‌పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?

Published on Sun, 12/31/2023 - 18:57

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ ఆపై బెయిల్‌ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్‌ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్‌లో రన్నర్‌గా ఆమర్‌ దీప్‌ ఉంటే టాప్‌-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్‌ బాస్‌ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.

బిగ్‌ బాస్‌ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్‌లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్‌ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో  శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్‌, యావర్‌ విషయంలో నేను స్టాండ్‌ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు  ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్‌ కెప్టెన్‌ బ్యాడ్జ్‌ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్‌ను హ్యాండిల్‌ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్‌ను బిగ్‌ బాస్‌ తీసుకున్నాడు. ఒక కామన్‌ మ్యాన్‌ కెప్టెన్‌ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్‌లో కొందరు యావర్‌తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది.

ఫైనల్‌గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్‌ బాస్‌లో ప్రశాంత్‌ను మానశికంగా కొందరు టార్చర్‌ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్‌ను అమర్‌ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్‌, ప్రశాంత్‌ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్‌ భుజం మీద చెయి వేసి అమర్‌ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్‌కు బౌండ్‌ అయి అగ్రిమెంట్‌లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్‌పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. 

బిగ్‌ బాస్‌ అనేది ఒక గేమ్‌.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్‌ వరకే పరిమితం. అయినా ప్రశాంత్‌, అమర్‌ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్‌ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్‌ బాస్‌ సీజన్‌ -7 ముగిసి పోయిన చాప్టర్‌.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ..  ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా  ప్రశాంత్ కెప్టెన్సీ  నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ..

అమర్‌ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. హౌస్‌లో  ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.  అమర్‌ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)