Breaking News

రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

Published on Sat, 12/06/2025 - 16:00

బుల్లితెర నటి సారా ఖాన్‌ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్‌ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్‌ లాహిరి కుమారుడే క్రిష్‌ పాఠక్‌. డిసెంబర్‌ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 

రెండో పెళ్లి
ఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్‌లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్‌కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్‌.. సాప్న బాబుల్‌ కా బిడాయి సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. 

బుల్లితెరపై, వెండితెరపై..
పలు సీరియల్స్‌తో పాటు జర నాచ్‌కే దిఖా, నాచ్‌ బలియే 4 వంటి డ్యాన్స్‌ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్‌ రెయిన్‌బో, సైనైడ్‌, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్‌ అప్‌ షోలోనూ పార్టిసిపేట్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్‌ కూడా పాల్గొన్నాడు. బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

మొదటి పెళ్లి
బయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్‌ 2016లో అనమ్‌ మర్చంట్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్‌ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు.

 

 

చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్‌ చిన్నత్త

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి